Flower Flower Flower Flower Toran Toran Base Aasan Vasavi Matha Ganesha Chakra Services Gallery Contact Our Team AboutUs
Mobile banner
flower flower
ఆర్యవైశ్య ఆత్మ బంధువులారా!
Title

ఆంధ్రప్రదేశ్, యన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ రూరల్ మండలం నందు రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, కరెన్సీనగర్, మురళీనగర్ గ్రామాల ఆర్యవైశ్యులందరమూ కలసి ఒక సంఘంగా ఏర్పడి శ్రీ వాసవీ సేవా సంఘం అనే పేరుతో రి.నెం. 82/2014గా రిజిష్టరు కాబడి గత 11 సంవత్సరాలుగా అమ్మవారికి పలు కార్యక్రమాలు (అమ్మవారి ఆత్మాహుతి, జయంతి, ఆషాడ సారె) మరియు ఇతర కార్యక్రమాలు అనగా గాంధీజయంతి, పొట్టి శ్రీరాములు జయంతి, కార్తీక వనసమారాధన, తెలుగు సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించుటకు అమ్మవారికి గుడి లేనందున ప్రతి సారి ఖాళీ స్థలము/మండపములు వెతుక్కుని కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుంది. అమ్మవారి గుడి నిర్మాణానికి స్థలమునకు సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది.

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్, యన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ రూరల్ మండలం, ఎనికేపాడు గ్రామం, 24కే కళ్యాణమండపం వెనుక ఏరియాలో చ॥గ॥ 270లు ఖాళీ నివేశన స్థలము నందు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మాణం చేయుటకు శ్రీ వాసవీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవీ సేవా సంఘం ఆలయ నిర్మాణ కమిటీగా ఏర్పడి గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టినాము.

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణము కొరకు శంకుస్థాపన కార్యక్రమము ది. 03-10-2025న సంఘంలోని సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షములో వైభవంగా పూర్తి చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ నందు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు అయిన వినాయక స్వామి, శివాలయం మరియు సుబ్రమణ్యేశ్వర స్వామి వారి ఆలయములు, ఫస్ట్ ఫ్లోర్ నందు కళ్యాణమండపం, సెకండ్ ఫ్లోరు నందు భోజనశాల నిర్మించుటకు కమిటీ వారు నిర్ణయించడమైనది. వీటి నిర్మాణము మొత్తమునకు సుమారుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు అగును. దీని నిమిత్తం విరాళాలు ధనరూపేణా మరియు వస్తురూపేణా సేకరించుటకు నిర్ణయించడమైనది.